తెలంగాణలో హడలెత్తిస్తున్న కరోనా.. ఒక్కరోజే వెయ్యికి పైగా

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణాలో 1,018 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో [more]

Update: 2020-07-02 02:18 GMT

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణాలో 1,018 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,537కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 267 మంది చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 9,008 ఉన్నాయి. 8,082 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదయిన 1,018 కేసుల్లో 881 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం.

Tags:    

Similar News