నన్నపనేనిపై కేసు

దళిత మహిళా ఎస్‌ఐని దూషించిన కేసులో టీడీపీ సీనియర్‌ నేత నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదుతో [more]

Update: 2019-09-12 10:55 GMT

దళిత మహిళా ఎస్‌ఐని దూషించిన కేసులో టీడీపీ సీనియర్‌ నేత నన్నపనేని రాజకుమారిపై మంగళగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదుతో 303, 506,509 r/w 34 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న చలో ఆత్మకూరు సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు గృహనిర్భందం చేశారు. చంద్రబాబును కలిసేందుకు నన్నపనేని మరికొందరు మహిళా నాయకులు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై అనురాధ వారిని చంద్రబాబు ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో నన్నపనేని ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ ఎస్సై అనురాధను దూషించారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ అనురాధతో పాటు సిబ్బందిపై అసభ్య పదజాల దూషణ, విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెతో పాటు టీడీపీ మహిళ నాయకురాలు సత్యవాణిలపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News