అదే చేస్తే కాకినాడ వస్తా

జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం అత్యంత హేయమని పవన్ కల్యాణ్ [more]

Update: 2020-01-12 13:05 GMT

జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడిని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కాకినాడలో జనసేన కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం అత్యంత హేయమని పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. అక్కడి ఎమ్మెల్యే అనుచితంగా మాట్లాడటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు. దాడులు చేస్తుంటే వెనకడుగు వేస్తామని అనుకోవద్దని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇంకా రెచ్చగొడితే తాను కాకినాడకు రావాల్సి ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News