Gold Rates Today : బంగారాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన పక్కన పెట్టేయడమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా నిలకడ కనిపిస్తుంది
బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. వెండి ధరలు దిగి రావడం లేదు. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బంగారం అంటే అందరికీ మక్కువే.అలాగే వెండి వస్తువులు ఇంట్లో శుభప్రదంగా భావిస్తారు. కానీ గత కొద్ది రోజులుగా.. అంటే ఈ ఏడాది జనవరిలో మొదలయిన ర్యాలీ ఆగలేదు. అందుకే బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే లక్షల రూపాయలు అవసరమవుతుండటంతో వెనక్కుతగ్గుతున్నారు. ఇక ఈ ఏడాది బంగారం ప్రియులకు చేదును మిగిల్చింది. మిగుల్చుకున్న కొంత మొత్తంతో బంగారం కొనుగోలు చేయలేక ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతున్నారు.
సెంటిమెంట్...
బంగారం అంటే ఒక సెంటిమెంట్. దానిని ఎవరూ కాదనలేరు. సంప్రదాయంగా వస్తున్న ఆచారం. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం శుభకార్యాలు జరిగినప్పుడు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం సాధారణం. కానీ ఇప్పుడు బంగారం విషయంలో వారి ఆలోచనలు మారిపోయాయి. వరకట్నం అనేది ఎప్పుడో పోయింది. అయితే దాని స్థానంలో పసిడి వచ్చిందంటున్నారు. వధువు తల్లిదండ్రులు బంగారం ఎంత పెడుతున్నారన్న దానిపై పెళ్లిళ్లు జరుగుతున్నాయన్నది ఆశ్చర్యం కలిగించక మానదు. 2026 ఏడాదిలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని, ఇక వాటి ధరలను ఆపడం ఎవరి వల్లా కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
నేటి ధరలు...
అందుకే పెట్టుబడి పెట్టేవారు ఇప్పుడు బంగారం కంటే వెండిపై ఎక్కువగా మదుపు చేస్తున్నారు. వెండి కిలో రెండు లక్షల ఇరవై రూపాయలు దాటేసి పరుగులు పెడుతూనే ఉండటంతో ఎక్కువ మంది వెండిపై పెట్టుబడి పెడుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా నిలకడ కనిపిస్తుంది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,180 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర1,34,180 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,26,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో భారీగా మార్పులుండవచ్చు.