పవన్ మళ్లీ కవాతు

ఇసుక కొరతతో వీధిన పడిన భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇప్పుడు రాజధాని రైతుల కోసం [more]

Update: 2020-01-09 11:44 GMT

ఇసుక కొరతతో వీధిన పడిన భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇప్పుడు రాజధాని రైతుల కోసం విజయవాడలో లక్షలాది మందితో లాంగ్ మార్చ్ నిర్వహించాలని పవన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అమరావతిని పరిరక్షించాలంటూ గత 22 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా లాంగ్ మార్చ్ విజయవాడలోనే నిర్వహిస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే తేదీ ఎప్పుడనేది తెలియకున్నా ఈ వారంలోనే కవాతును నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News