మేయర్ నుంచి ఎమ్మెల్సీ దాకా.. ఎమ్మెల్సీల చరిత్ర ఇదే

టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనూరాధ విజయవాడ మేయర్ గా పనిచేశారు. మేయర్ నుంచి ఎమ్మెల్సీగా ఆమె రాజకీయంగా ఎదిగారు

Update: 2023-03-23 14:46 GMT

టీడీపీ ఎమ్మెల్సీగా పంచుమర్తి అనూరాధ విజయవాడ మేయర్ గా పనిచేశారు. మేయర్ నుంచి ఎమ్మెల్సీగా ఆమె రాజకీయంగా ఎదిగారు. 2000 నుంచి 2005 వరకూ ఆమె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. పద్మశాలి కుటుంబంలో జన్మించిన పంచుమర్తి అనూరాధ తొలుత సాధారణ గృహిణి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అప్పట్లో ఆమెకు కార్పొరేటర్ పదవిని కేటాయించారు. తర్వాత మేయర్ ను చేశారు. మేయర్ కాకముందు ఆమెకు రాజకీయమంటే ఏమిటో తెలియదు. కానీ మేయర్ పదవిని చేపట్టిన తర్వాత రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు.

బీసీ నేతగా...
ఆ తర్వాత ఆమె టీడీపీలోనే కొనసాగారు. రెండు దశాబ్దాల నుంచి టీడీపీలోనే ఉన్నారు. పార్టీ కష్టంలో ఉన్న సమయంలోనూ ఆమె టీడీపీకి మౌత్ పీస్ గా మారారు. అధికార పార్టీని ఎండగట్టడంలో అనూరాధ ముందుంటారు. ఇక సోషల్ మీడియాలోనూ ఆమె యాక్టివ్ గా ఉంటారు. టీడీపీకి నమ్మకమైన నేతగా పేరుపొందారు. అందుకే గతంలో ఒకసారి ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసినా ఆమె అంగీకరించలేదు. తాను ఎమ్మెల్యే కోటా కింద మాత్రమే పోటీ చేస్తానని చెప్పారు. ఈసారి చంద్రబాబు ఆమెకు అవకాశమిచ్చి గెలిపించుకోగలిగారు. ఇలా మేయర్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు.
మర్రి రాజశేఖర్ కు...
వైసీపీ నుంచి గెలుపొందిన ఆరుగురు ఎమ్మెల్సీల్లో కోలా గురువులు ఓటమి పాలయ్యారు. ఈయన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఉన్నారు. మత్స్యకార వర్గానికి చెందిన కోలా గురువులు పరాజయం పాలయ్యారు. ఇక వైసీపీ నుంచి గెలిచిన ఆరుగురి ఎమ్మెల్సీల నేపథ్యమిది. మర్రి రాజశేఖర్ కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. చిలకలూరిపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ పదవి కోసం చూస్తున్నారు. చివరకు మర్రి రాజశేఖర్ విజయం సాధించారు. ఇక జయమంగళ వెంకట రమణ నెల క్రితమే పార్టీలో చేరారు. ఆయన వడ్డి సామాజికవర్గానికి చెందిన నేత. కైకలూరు మాజీ ఎమ్మెల్యే. ఆయన టీడీపీలో టిక్కెట్ రాదని భావించి వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ అయ్యారు.
కోలా గురువులు మినహా...
చంద్రగిరి ఏసురత్నం గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పెనుమత్స సురేష్, పోతుల సునీతలు గతంలోనూ ఎమ్మెల్సీలే. మరొకసారి జగన్ వారిద్దరికీ అవకావం కల్పించారు. గెలిచిన మరొక ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ కోనసీమకు చెందిన షెడ్యూల్ కులాలకు చెందిన నేత. అక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు టిక్కెట్లు ఇచ్చారు. దీంతో ఆయన గెలిచారు. వైసీపీ బరిలోకి దింపిన ఏడుగురిలో కోలా గురువులు తప్ప మిగిలిన ఆరుగురు విజయం సాధించారు.


Tags:    

Similar News