నితీష్ కుమార్ సంచలన నిర్ణయం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి వేళ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. రాత్రి 9 గంటల నుంచి [more]

Update: 2021-04-19 01:13 GMT

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి వేళ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుందని నితీష్ కుమార్ ప్రకటించారు. విద్యాసంస్థలన్నీ మే 15వ తేదీ వరకూ తెరవబోమని చెప్పారు. హోటళ్ల నుంచి కేవలం పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందతి. మే 15 వరకూ అన్ని ప్రార్థనాలయాలను మూసివేస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ కు ఆరోగ్య కార్యకర్తలకు ఒక నెల బోనస్ ను విడుదల చేశారు.

Tags:    

Similar News

.