Gold Price Today : గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు మరింత పరుగులు పెడుతున్నాయి. వెండి ధరలు దానితో పోటీ పడి పరుగుతీస్తున్నాయి. ధరలు పెరగడంతో దాని ప్రభావం కొనుగోలుపై పడింది. వెండి ధర ఇటీవల కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ మళ్లీ పెరగడం ప్రారంభించింది. ధరలు పెరుగుుతుండటంతో వినియోగదారులు జ్యుయలరీ దుకాణాలవైపు చూసేందుకు కూడా వెనకడగు వేస్తున్నారు. బంగారం అనేది ఇప్పుడు భారంగా మారింది. అలాగే వెండి అనేది అందని వస్తువుగా తయారయింది.అయితే ప్రస్తుతం కొనుగోళ్లు పెద్దగా లేకపోవడంతో జ్యుయలరీ దుకాణాలు పెద్దయెత్తున ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తరుగు వంటి వాటిల్లో రాయితీలు ఇస్తామన్న పెరిగిన ధరలను చూసి వారు రావడం లేదు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు...
బంగారం అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఒక ఆనవాలు. సెంటిమెంట్. ముఖ్యంగా మహిళలకు సెంటిమెంట్ గా మారింది. బంగారం విషయంలో మహిళలు మొన్నటి వరకూ వెనక్కు తగ్గకుండా కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపేవారు. కానీ ధరల పెరుగుదల చూసి బంగారం కొనుగోలు చేయడం కంటే మరొక వస్తువు కొనుగోలు చేయడం ఉత్తమమని నమ్ముతున్నారు. మహిళలు అలంకరణగా వినియోగించే బంగారు ఆభరణాల స్థానాల్లో ప్రస్తుతం గిల్ట్ నగలతో పాటు వన్ గ్రామ్ గోల్డ్ వంటివి దర్శనమిస్తున్నాయి. మహిళలు కూడా బంగారం పట్ల ఆసక్తి కోల్పోయారు. పురుషులు కూడా బంగారం కొనాలంటే తమ శక్తికి మించిన పని అని చేతులెత్తేస్తున్నారు.
నేటి ధరలివీ...
ధరలు ఈ రేంజ్ లో పెరగడంతో బంగారు దుకాణాలు దాదాపుగా వెలవెలపోతున్నాయి. స్కీమ్ లు కట్టి బంగారం కొనుగోలు చేసేవారు కూడా కరువయ్యారు. మరొకవైపు శుభకార్యాల సీజన్ కూడా లేదు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై మూడు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,610 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,34,850 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,24,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.