4 April-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు జరుపుతున్నారు. అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.

Update: 2024-04-04 12:19 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Janasena : అవనిగడ్డ జనసేన అభ్యర్థి బుద్ధప్రసాద్

అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు జరుపుతున్నారు. అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు.

YSRCP : వైసీపీకి కూసాలు క‌దులుతున్నాయ్‌.. తలకిందులుగా తపస్సు చేసినా గెలవదట

రాజ‌కీయాల్లో శాశ్వత శ‌త్రువులు, శాశ్వత మిత్రులు కూడా ఉండ‌రంటారు. ఇప్పుడు ఈ ఫార్ములానే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప‌ర్చూరులోనూ క‌నిపిస్తోంది. ఇక్కడ రాజ‌కీయంగా గ‌త ఏడాది ఒక‌రిపై ఒక‌రు పోటీ చేశారు.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు, ఏలూరి సాంబ‌శివ‌రావు.

Volunteers : వాలంటీర్లు దెబ్బేస్తారా? పక్కన పెట్టడం వల్ల నష్టం వారికేనా?

ఒక వ్యవస్థ హిట్ అయితే.. దానిని ప్రజలు ఆదరిస్తారు. లేకుంటే రాజకీయంగా అమలు చేసిన ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. కానీ ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ అయింది. ఎంతగా అంటే..ఎంతగా అంటే.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల వ్యవస్థను జనం స్వాగతించారు. ఇప్పుడు ఎన్నికల నిబంధనలతో పక్కన పెట్టడంతో రాజకీయంగా ఎవరికి నష్టం అనే చర్చ ఏపీ పాలిటిక్స్ లో జోరుగా సాగుతుంది.

IPL 2024 : స్కై.. కోసం ఎదురు చూపులు.. వస్తే ఇక దబిడి దిబిడే

వరస ఓటములతో నీరసపడిన ముంబయి ఇండియన్స్ టీంకు గుడ్ న్యూస్. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తున్నాడు. స్కై వస్తే ముంబయి ఇండియన్స్ విజయాలను మొదలు పెడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేదు.

ఏపీ వాసులకు హెచ్చరిక...ఈరోజు, రేపు తీవ్ర వడగాలులు

ఈరోజు పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో పాటు 130 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. రేపు ఐదు మండలాల్లో తీవ్రమైన, 253 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Chandrababu : వందకు వంద శాతం గెలుపు మనదే.. ఇది ఫిక్స్

రానున్న ఎన్నికల్లో గెలుపు కూటమిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వందకు వంద శాతం మనదే గెలుపు అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ప్రజాగళం సభలో ప్రసంగించారు. వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.

YSRCP : వైసీపీలో చేరిన టీడీపీ నేత

వైఎస్ జగన్ బస్సు యాత్రలో చేరికలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఎద్దల చెరువు వద్ద బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్‌ రెడ్డి చేరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

IPL 2024 : నేడు మరో మోస్ట్ ఇంట్రస్టింగ్ మ్యాచ్

ఐపీఎల్ లో రికార్డులు నమోదవుతన్నాయి. కొత్త కుర్రోళ్లు రెచ్చిపోతున్నారు. టీం ఇండియాకు మంచి ఆటగాళ్లు ఈ ఐపీఎల్ ద్వారా కూడా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ సీజన్ ప్రాంరభమయిన నాటి నుంచి ప్రతి మ్యాచ్ అభిమానులను అలరిస్తుంది కొన్ని మ్యాచ్ లు అతి తక్కువ పరుగులు చేసి పూర్తయితే..

ఏనుగు దాడిలో మరొక వ్యక్తి మృతి

ఏనుగు దాడిలో మరో రైతు మృతి చెందాడు. 24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెంచికల్‌ మండలం కొండపల్లిలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో మరో వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.

వ్యవస్థను అడ్డంకొట్టింది నువ్వు కాదా చంద్రబాబూ?

పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్ పై టీడీపీ నేతలు వత్తిడి తీసుకు వచ్చారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఏప్రిల్ ఒకటోతేదీన బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునేందుకు కొంత ఆలస్యమయిందని, అయితే దీనిపై ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.





Tags:    

Similar News