Gold Price Today : షాకింగ్ న్యూస్...చెప్పలా.. చెప్పలా.. మళ్లీ బంగారం ధరలు పెరిగాయిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. గత కొద్ది రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఆరంభమయిన నాటి నుంచి దాదాపు పది రోజుల పాటు తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు ఒక్కసారిగా పెరిగి కొనుగోలు దారులను నిరాశకు గురిచేశాయి. మార్కెట్ నిపుణులు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ధరలు పెరుగుతాయని అవసరమైన వారు ముందుగానే కొనుగోలు చేయాలని చెప్పినా కొందరు ఇంకా తగ్గుతాయేమోనని ఎదురు చూసి ఇప్పుడు కంగుతిన్నారు.
నిలకడగా ఉండవని చెబుతున్నా...
బంగారం ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. వెండి ధరలు కూడా అంతే. ధరల పెరుగుదలకు, డిమాండ్ కు సంబంధం లేదు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, బంగారం దిగుమతులు తగ్గడం వంటివి బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఇందుకు తోడు శుభకార్యాల సీజన్ కూడా తోడయింది.
నేటి ధరలు ఇలా...
పెట్టుబడి పెట్టిన వారు వెనక్కు తీసుకోకపోవడం, ఒక్కసారిగా బంగారం, వెండి ఆభరణాలకు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 680 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,910 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,58,090 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,75, 900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరిగే అవకాశముంది.