Sat Mar 14 2026 21:24:22 GMT+0530 (India Standard Time)
ఏనుగు దాడిలో మరొక వ్యక్తి మృతి
ఏనుగు దాడిలో మరో రైతు మృతి చెందాడు. 24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది

ఏనుగు దాడిలో మరో రైతు మృతి చెందాడు. 24 గంటల్లో ఏనుగుదాడిలో ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెంచికల్ మండలం కొండపల్లిలో ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో మరో వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.
ఆహారం, నీటి కోసం...
అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల మీదకు వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా మంచినీరు, ఆహారం కోసం గ్రామాల్లోని పొలాల వెంట వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లవద్దని, ఏనుగులు రాకుండా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం 5 గంటలకు పోచన్న అనే రైతు పొలానికి వెళ్తుండగా ఏనుగుదాడి చేసి చంపింది.
Next Story

