Fri Dec 05 2025 17:49:48 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : అవనిగడ్డ జనసేన అభ్యర్థి బుద్ధప్రసాద్
అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు

అవనిగడ్డ అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ల్వే కోడూరు అభ్యర్థి మార్పుపై సమాలోచనలు జరుపుతున్నారు. అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. అనంతరం బుద్ధ ప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి పేరుపై రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
రైల్వే కోడూరు మాత్రం...
అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు. రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదు. మిత్ర పక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. కొద్ది గంటలో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకుంటారు.
Next Story

