Thu Mar 19 2026 06:28:40 GMT+0530 (India Standard Time)
వ్యవస్థను అడ్డంకొట్టింది నువ్వు కాదా చంద్రబాబూ?
వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్ పై టీడీపీ నేతలు వత్తిడి తీసుకు వచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్ పై టీడీపీ నేతలు వత్తిడి తీసుకు వచ్చారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఏప్రిల్ ఒకటోతేదీన బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునేందుకు కొంత ఆలస్యమయిందని, అయితే దీనిపై ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖజానాలో డబ్బులు లేవంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగారన్నారు.
ఉద్యోగాలు ఇవ్వలేదంటూ...
వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని చేసిన తప్పును సరిదిద్దుకేనే పనిలో టీడీపీ నేతలు పడ్డారన్నారు. జన్మభూమి కమిటీల మాదిరి కాదని, వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ప్రజల్లో మంచి పేరు వచ్చిందన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ఏం జరిగిందన్నది ప్రజలకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వలేదన్న వారే సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయించవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారన్నారు. అడ్డం గొట్టింది చంద్రబాబు అన్న సంగతి అందరికీ తెలుసునని, అది ప్రజలకు కూడా అర్థమయిందన్నారు.
Next Story

