MARCH 29-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఇప్పటి వరకూ నలుగురు అధికారులు అరెస్ట్ అయ్యారు. నిన్న మాజి డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపపథ్యంలో ఇంకెంత మంది ఈ కేసులో అరెస్ట్ అవుతారోనన్న చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతుంది. మరికాసేపట్లో రాధాకిషన్ ను పోలీసులు న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు. టాస్క్ ఫోర్స్ , ఎస్.ఐ.బి సిబ్బంది విచారణకు హాజరవుతున్నారు.

Update: 2024-03-29 13:16 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ లో ఇంకెంత మందో?

తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో ఇప్పటి వరకూ నలుగురు అధికారులు అరెస్ట్ అయ్యారు. నిన్న మాజి డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపపథ్యంలో ఇంకెంత మంది ఈ కేసులో అరెస్ట్ అవుతారోనన్న చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతుంది. మరికాసేపట్లో రాధాకిషన్ ను పోలీసులు న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు. టాస్క్ ఫోర్స్ , ఎస్.ఐ.బి సిబ్బంది విచారణకు హాజరవుతున్నారు.

Breaking : ఫోన్ ట్యాపింగ్ పై తొలిసారి రేవంత్ .. కేటీఆర్‌కు చర్లపల్లి జైలు తప్పదు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ తాగుబోతులా మాట్లాడుతున్నాడని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది అని కేటీఆర్ అంటున్నారని, ఏమయితది చర్లపల్లి జైల్లో కూర్చోవాల్సి వస్తుందని, చిప్పకూడు తినాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Allu Arjun : ఈ రికార్డుల్లో బన్నీ మొదటివాడని మీకు తెలుసా..!

మెగాహీరోగా ఇండస్ట్రీకి వచ్చి స్టైల్ స్టార్ గా తనకంటూ ఇమేజ్ ని సంపాదించుకోవడమే కాకుండా, తన ఐకానిక్ రోల్స్ తో ఐకాన్ స్టార్ అనే బిరుదుని అందుకున్నారు. అయితే కేవలం ఐకాన్ స్టార్ అని పిలిపించుకోవడమే కాదు, ఆ పిలుపుకి తగ్గట్టు రికార్డులు సెట్ చేస్తూ.. ఎంతోమందికి ఐకాన్ గా నిలుస్తున్నారు.

Congress : నువ్వు తోపు బాబాయ్.. నీలాంటోళ్లకు మాత్రం పదవులు రాకపోయె

నిజమే.. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే.. ఫిరాయింపు దారులకే రోజులు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకు మాత్రం పదవులు అస్సలు రావు. అదే పార్టీలు మారితే వాటంతట అవే పరుగులు పెడుతూ ఇంటి ముఖం ద్వారం వద్ద వెయిట్ చేస్తుంటాయి. వీటిని రోత రాజకీయాలనాలా?

Anasuya: నేను జనసేనకు ప్రచారం చేస్తా అనలేదు.. వైసీపీ లీడర్ రోజా గారు..

టాలీవుడ్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ.. ఏం మాట్లాడిన, ఏం చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే. ఈక్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయ పార్టీలు గురించి మాట్లాడారు. అవి కాస్త నెట్టింట వైరల్ అవ్వడం, ట్రోల్స్ కి గురవ్వడం జరిగాయి. దీంతో ఆ కామెంట్స్ కి అనసూయ వివరణ ఇచ్చారు.

BRS : ఆఖరికి కడియం కూడా.. ఇప్పటికైనా కేసీఆర్ కు తెలుస్తుందో లేదో?

బీఆర్ఎస్ కు వరస షాక్‌లు తగులులున్నాయి. తాను నమ్మి పదవులు ఇచ్చిన వారే తనను వీడి వెళ్లిపోతున్నారు. ఉద్యమంలో తన వెంట లేకపోయినా వివిధ సమీకరణాలతో వారిని దగ్గరకు తీసుకుని అందలం ఎక్కిస్తే అధికారానికి దూరం కాగానే వారు వెళ్లిపోతున్నారు. ఎవరు తన వాళ్లో..

IPL 2024 : రాజస్థాన్ రెండో విజయం... పరాగ్ వల్లనే సాధ్యమయిందిగా..?

ఐపీఎల్ లో అంతే.. ఎవరో ఒకరు క్లిక్ అయినా చాలు మ్యాచ్ మన చేతికి వచ్చినట్లే. అయితే ఆ ఆటగాడు ఎవరు అనేది మైదానంలోకి దిగేంత వరకూ తెలియదు. ఫామ్ లో ఉన్న ఆటగాళ్లు కూడా తీరా మ్యాచ్ సమయానికి పనికిరాకుండా పోతారు. అలాగే పరవాలేదు అనిపించిన ప్లేయర్ దుమ్మురేపి జట్టు విజయంలో కీలక భూమిక పోషిస్తారు. క్రికెట్ లోనూ.. ఐపీఎల్ లోనూ అదే జరుగుతుంది. అందుకే ఎవరు ఎప్పుడు రైజ్ అవుతారో చెప్పలేం. నిన్న రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ కేపిటల్స్ మ్యాచ్ లోనూ అదే జరిగింది.

Pawan Kalyan : రేపు పిఠాపురానికి పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపరం పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తొలిరోజు పవన్ కల్యాణ్ పురుహుతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారాహి వాహనానికి అక్కడ పూజలు చేస్తారు.

Kalvakuntla Kavitha : జైలు అధికారులపై కోర్టుకు కవిత

తీహార్ జైలు అధికారులు న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సౌజన్య కోటలో ఆమె తరుపున న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు. తనకు జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించిన సందర్భంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను జైలు అధికారులు అమలుపర్చడం లేదని పేర్కొన్నారు.

IPl 2024 : నేటి ఐపీఎల్ మ్యాచ్.. మజా చేసేయండి

నేడు మరో కీలక మ్యాచ్ ఐపీఎల్ లో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ పోటీ పడనుంది. బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే బెంగళూరు జట్టు ఒక మ్యాచ్ గెలిచి ఊపు మీద ఉంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి తన సత్తా చాటాలని భావిస్తుంది.


Tags:    

Similar News