Wed Mar 18 2026 16:04:38 GMT+0530 (India Standard Time)
Kalvakuntla Kavitha : జైలు అధికారులపై కోర్టుకు కవిత
తీహార్ జైలు అధికారులు న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయడం లేదని కల్వకుంట్ల కవిత న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు

తీహార్ జైలు అధికారులు న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సౌజన్య కోటలో ఆమె తరుపున న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు. తనకు జ్యుడిషియల్ రిమాండ్ కు ఆదేశించిన సందర్భంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను జైలు అధికారులు అమలుపర్చడం లేదని పేర్కొన్నారు.
తనకు కల్పించిన సౌకర్యాలను...
తనకు ఇంటి భోజనంతో పాటు బెడ్, మందులు, కళ్లద్దాలు, పుస్తకాలు, మంగళసూత్రాలను జైలులోకి అనుమతించాలని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ జైలు అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయని జైలు అధికారుల నుంచి న్యాయస్థానం ఈ మేరకు వివరణ కోరంది.
Next Story

