Wed Mar 18 2026 16:06:33 GMT+0530 (India Standard Time)
Pawan Kalyan : రేపు పిఠాపురానికి పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపరం పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపరం పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తొలిరోజు పవన్ కల్యాణ్ పురుహుతికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారాహి వాహనానికి అక్కడ పూజలు చేస్తారు.
మూడు రోజులు...
అనంతరం బషీర్ బీబీ దర్గాను దర్శించుకోనున్నారు. తర్వాత క్రైస్తవ మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. పవన్ కల్యాణ్ పిఠాపురానికి వస్తుండటంతో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story

