Thu Jan 29 2026 15:26:53 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఫోన్ ట్యాపింగ్ పై తొలిసారి రేవంత్ .. కేటీఆర్కు చర్లపల్లి జైలు తప్పదు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్ తాగుబోతులా మాట్లాడుతున్నాడని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుంది అని కేటీఆర్ అంటున్నారని, ఏమయితది చర్లపల్లి జైల్లో కూర్చోవాల్సి వస్తుందని, చిప్పకూడు తినాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అచ్చోసిన ఆంబోతులా కేసీఆర్ మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కు సిగ్గుండాలని అన్నారు. కేటీఆర్ ఫలితం అనుభవించక మానడని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్ నగర్ లో...
మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ దేనని అన్నారు. త్వరలోనే సంపత్ కుమార్ కు ప్రభుత్వంలో పదవి వస్తుందని, ఆ మేరకు తాను అధినాయకత్వంతో మాట్లాడతానని రేవంత్ రెడ్డి తెలిపారు. బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఆయన మాట ఇచ్చారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఫలితం ఉండదన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. బీజేపీ వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారని, వారిని అస్సలు పట్టించుకోవద్దని మహబూబ్ నగర్ జిల్లా కార్యకర్తలకు రేవంత్ రెడ్డి తెలిపారు.
Next Story

