ఆ లడ్డూకు అంత క్రేజ్ ఎందుకు….?

ప్రతి ఏటా ఆ మండంపం నుంచే నిమజ్జనం ప్రారంభం అవుతుంది. అక్కడ ఒక్క రౌండు ఊరేగింపు జరుగగానే వేలాది మంది అక్కడ పోగవుతారు. ఎందుకంటే అక్కడ ఉన్న లడ్డూను [more]

Update: 2019-09-12 06:01 GMT

ప్రతి ఏటా ఆ మండంపం నుంచే నిమజ్జనం ప్రారంభం అవుతుంది. అక్కడ ఒక్క రౌండు ఊరేగింపు జరుగగానే వేలాది మంది అక్కడ పోగవుతారు. ఎందుకంటే అక్కడ ఉన్న లడ్డూను ఎవరు సొంతం చేసుకుంటారని…. అదే బాలాపూర్ లడ్డూ విశిష్టత. ప్రతి ఏటా ఇక్కడ లడ్డూ వేలం రికార్డు సృష్టిస్తుంది. ఈ ఏటా అదే దారిలో గత ఏడాది కంటే ఎక్కువ ధరకే పలికింది. భక్తుల జయజయ ధ్యానాల మధ్య కొలను రామిరెడ్డి ఈ బాలాపూర్ లడ్డూను రూ.17.60 లక్షలకు కైవసం చేసుకున్నారు.

బంగారు పూతతో….

ఈ ఏడాది లడ్డూ విశేషం ఏంటంటే బంగారు పూతతో ఉంది. 21 కిలోల లడ్డూను బాలాపూర్ మండపంలోని గణేష్ మండపంలోని వినాయకుడిచేతిలో పెట్టారు. పది రోజుల విశేష పూజలందుకున్న ఈ గణనాధుడి చేతిలోని లడ్డూ ఎంతో ప్రాముఖ్యత గలదని చెబుతుంటారు. కోరిన వరాలు ఇస్తాడనే నమ్మకంతో ఎంతోమంది ఈ లడ్డూ కైవసం చేసుకోవడానికి పోటీ పడతారు. ఈ ఏడాది కూడా 28 మంది లడ్డూ వేలం పాటలో పాల్గొన్నారు. ఈ లడ్డూను తాపేశ్వరం మిఠాయి దుకాణ దారులు తయారు చేశారు. గత ఏడాది ఈ లడ్డూ ధర రూ.16.60 లక్షలు పలికింది.

 

 

 

Tags:    

Similar News