జైలుకు పంపినా... తగ్గేదే లేదు

దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు.

Update: 2023-03-25 07:46 GMT

దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు. అదానీ షెల్ కంపెనీల్లో ఇరవై వేల కోట్ల పెట్టుబడి ఎవరు పెట్టారని రాహుల్ ప్రశ్నించారు. ఆ ఇరవై వేల కోట్లు ఎవరివో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. నిబంధనలు మార్చి ఎయిర్‌పోర్టులు అదానీకి ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రులు పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇద్దరి మధ్య సంబంధాలు...
స్పీకర్ ను కలసి మాట్లాడాలని సమయం ఇవ్వాలని కోరితే నవ్వి వదిలేశారని రాహుల్ తెలిపారు. అదానీ, మోడీ స్నేహం గురించి పార్లమెంటు సమావేశాల్లో తాను మాట్లాడానని తెలిపారు. తాను స్పీకర్ కు రెండు లేఖలు రాస్తే వాటికి సమాధానం లేదని చెప్పారు. తాను దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడనని, పోరాడుతూనే ఉంటానని చెప్పారు. అదానీ, మోడీ స్నేహం ఈనాటిది కాదని, ఎప్పటి నుంచో వీరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచే వీరి బంధం కొనసాగుతుందన్నారు.
ఎవరకీ భయపడను...
తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కానని రాహుల్ తెలిపారు. నిబంధనలు తుంగలోకి తొక్కి వ్యవహరిస్తున్నా విపక్షాలు ప్రశ్నించకుండా ఉండాలంటే ఎలా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా వెనక్కు తగ్గేది లేదన్నారు. తాను దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని తెలిపారు. తాను విదేశీ శక్తుల నుంచి సమాచారం తీసుకున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.


Tags:    

Similar News