బ్రేకింగ్ : ఈఎస్ఐ స్కాంలో మరికొన్ని అరెస్ట్ లు

ఈఎస్ఐ స్కాంలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరో [more]

Update: 2020-08-19 06:55 GMT

ఈఎస్ఐ స్కాంలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరో ఐదుగురు ఈ కేసులో భాగస్వామ్యులయినట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు బెయిల్ రాకపోవడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో మరో ముగ్గురిపై కొత్తగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పరారీలో ఉన్నారని, ఆయన పేరు కూడా ఇందులో ఉందని ఏసీబీ జేడీ పేర్కొన్నారు. ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులున్నట్లు గుర్తించామని చెప్పారు.

Tags:    

Similar News