ఛార్జీలు పెంచారా? ఇక చూసుకోండి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2021-12-01 08:06 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు ఛార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై షర్మిల స్పందించారు. ధరలు పెంచి ప్రజలపై మరోసారి భారం మోపేందుకు రెడీ అవుతున్నారని షర్మిల ఆరోపించారు. పాలన చేతకాకపోతే దిగిపోండి సారూ అని షర్మిల ఫైర్ అయ్యారు. వైఎస్ పాలనలో మున్సిపల్ పన్నుల నుంచి కరెంట్ ఛార్జీల వరకూ ఏదీ పెంచింది లేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఛార్జీలు పెంచితే...
కేసీఆర్ పాలనలో అన్ని సంస్థలు నష్టాల బాటలోనే నడుస్తున్నాయని షర్మిల తెలిపారు. మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రాన్ని చేతిలో పెడితే కేసీఆర్ ఆర్థిక పరిస్థితిని ధ్వంసం చేశారన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా పాలన మారిందన్నారు. ఏమాత్రం ఛార్జిలు పెంచినా తాము ప్రజల తరుపున ఆందోళనకు దిగుతామని షర్మిల హెచ్చరించారు.


Tags:    

Similar News