Revanth Reddy : నేటి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గ్లోబల్ సమ్మిట్ కు రేవంత్ రెడ్డి చేరుకుంటారు. తొలుత వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1:30 కి సమ్మిట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. గవర్నర్ ప్రసంగించిన తర్వాత తర్వాత రేవంత్ ప్రసంగం ఉండనుంది.
రౌండ్ టేబుల్ సమావేశంలో...
వివిధ రంగాల ప్రతినిధులతో ప్రతి 15 నిమిషాలకో వన్ టు వన్ రౌండ్ టేబుల్ మీటింగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు. రాత్రి ఏడు గంటలకు సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతినిధులకు ప్రభుత్వం ఇచ్చే విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.