Telangana : గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రులతో పాటు సినీనటుడు నాగార్జున కూడా సమ్మిట్ కు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సమ్మిట్ ప్రారంభం కానుంది.
సాయంత్రం ఆరు గంటల వరకూ...
సదస్సు ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇప్పటికే అనేక మంది విదేశీ ప్రముఖులు, పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం సాయంత్రం ఆరు గంటల వరకూ సాగనుంది. విదేశీ రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశమవుతారు.