Kalvakuntla Kavitha : మాజీ మంత్రి మల్లారెడ్డిపై విరుచుకుపడిన కవిత
మాజీ మంత్రి మల్లారెడ్డి పై తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి మల్లారెడ్డి పై తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలు అమ్మి, పూలు అమ్మి వేల ఎకరాలు కబ్జా పెట్టాడంటూ విమర్శలు చేశారు. మల్లారెడ్డి వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదని, మేడ్చల్ లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని కవిత అన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉందన్న కవిత బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైనా జరిగింది అంటే డంప్ యార్డ్ సమస్య కొంత తీరిందన్న కవిత కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ ఆ సమస్య డబుల్, త్రిబుల్ అయిందన్నారు.
అభివృద్ధి ఏమీ జరగలేదంటూ...
బీఆర్ఎస్ హయాంలో కొన్ని పెన్షన్లు వచ్చాయని, అంతే తప్ప అంతకు మించి అభివృద్ధి ఏమీ జరగలేదని కల్వకుంట్ల కవిత తెలిపారు. మల్లారెడ్డి తన కాలేజిలు, యూనివర్సిటీలు తప్ప ప్రజలు మాత్రం ఏమీ బాగుపడలేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరి లేబర్ మినిస్టర్ గా ఉన్న మల్లారెడ్డి కనీసం మానవ హక్కుల గురించి ఆలోచించలేదని, ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలన్న సోయ కూడా ఆయనలో కనిపించకపోవడం దురదృష్టకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.