ఆమ్రాపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐఏఎస్ అధికారి ఆమ్రాపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2025-12-08 07:14 GMT

ఐఏఎస్ అధికారి ఆమ్రాపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. క్యాట్ ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని అమ్రాపాలిని ఆదేశించింది. ఆమ్రాపాలిని తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

క్యాట్ ఉత్తర్వులపై...
ఆమ్రాపాలి 2010 బ్యాచ్ అధికారిణి. అయితే ఆమెను ఏపీకి కేటయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె తిరిగి క్యాటన్ ను ఆశ్రయించడంతో ఆమ్రాపాలికి తెలంగాణకు కేటాయిస్తూ తీర్పు చెప్పింది. ఆమెను ఇటీవల సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పుతో తిరిగి తెలంగాణ కేడర్‌కు కేటాయించారు, దీనితో ఆమె ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు మారారు. అయితే తాజాగా హైకోర్టు తీర్పుతో ఆమెకు ఎదురుదెబ్బతగిలినట్లయింది.


Tags:    

Similar News