Kalvakuntla Kavitha : హరీశ్ రావుపై మరోసారి కవిత ఫైర్

హరీశ్ రావుపై మరోసారి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Update: 2025-12-08 12:41 GMT

హరీశ్ రావుపై మరోసారి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరడగుల బుల్లెట్ మేడ్చల్ జిల్లాలో కనీసం ఒక హాస్పిటల్ కట్టించలేదని మండిపడ్డారు. మేడ్చల్ లో 32 లక్షల మంది ఉంటే కనీసం 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లేదన్నారు. కూకట్ పల్లిలో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. లక్ష్మాపూర్ ను ఇద్దరు ముఖ్యమంత్రులు వాడుకున్నారని, కానీ వారి సమస్యలు తీరలేదన్నారు. ఉప్పల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ కూకట్ పల్లి లో మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిందన్నారు.

బీటీ బ్యాచ్ అందరూ...
వారు చెరువులు, కబ్జాలు, పవర్ కోసమే బీఆర్ఎస్ లోకి వచ్చారని కల్వకుంట్ల కవిత అన్నారు. కుత్బుల్లాపూర్ ను కబ్జాల పూర్ అని పిలుస్తున్నారని, కబ్జాలను పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్తే వారి సమస్యలు తెలుస్తాయన్న కవిత డిఫాక్టో సీఎం కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అభివృద్ధి చేశానని చెప్పారని, మేడ్చల్ కు వెళ్లి చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని సెటైర్ వేశారు. మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా లోని ఉప్పల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్ పల్లిలో కవిత పర్యటన సాగుతోంది.


Tags:    

Similar News