Weather Report : చలి.. వాన.. కలసి నలిపేస్తున్నాయిగా?
దిత్వా తుపాను ప్రభావంతో నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దిత్వా తుపాను ప్రభావంతో నేడు కూడా కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దిత్వాతుపాను బలహీనపడి అల్పపీడనం గా మారి అది కూడా బలహీన పడటంతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు మాత్రమే పడతాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడకక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు ఎక్కడా నమోదు కావని, అయితే కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని తెలిపింది.
మోస్తరు వానలు...
ఆంధ్రప్రదేశ్ లోనేడు కూడా అక్కడకక్కడా సాధారణ వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాప్రాంతంలో నేడు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలోనూ నేడు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు అక్కడక్కడ పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే చలిగాలుల తీవ్రత కూడా పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో నేడు చలిగాలుల తీవ్రత...
తెలంగాణలో నేడు చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి తెలంగాణలోని అన్నిజిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని, ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ జిల్లా, ములుగు జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. చలిగాలులు, పొగమంచు ప్రభావంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులతో పాటు దీర్ఘకాలికరోగులు చలిగాలుల తీవ్రత ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది.