Supreme Court : నేడు సుప్రీంకోర్టులో బనకచర్ల వివాదం

ఈరోజు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరగనుంది

Update: 2026-01-05 02:36 GMT

ఈరోజు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ఈ కేసును విచారణ జరపనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు మళ్లించడానికి తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ లోని బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు నష్టం జరుగుతుందని పేర్కొంది.

ఇరు రాష్ట్రాల వాదనలు...
తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ వాదిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం తరుపున అభిషేక్ సింఘ్వి తన వాదనలను వినిపించనున్నారు. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం కేవియట్ వేసింది. రాజకీయ ఉద్దేశ్యంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీంతో నేడు ఇరు రాష్ట్రాల వాదనలను నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విననుంది.


Tags:    

Similar News