త్వరలోనే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా
తెలంగాణ రాష్ట్రం త్వరలోనే పూర్తిస్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరించనుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు
తెలంగాణ రాష్ట్రం త్వరలోనే పూర్తిస్థాయిలో మావోయిస్టు రహిత రాష్ట్రంగా అవతరించనుందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న 17 మంది తెలంగాణ వాసులు లొంగిపోతే, రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా లొంగిపోని మావోయిస్టుల వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు తెలిపారు. కేంద్ర కమిటీలో నలుగురు, రాష్ట్ర కమిటీలో ఐదు గురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్ గ్రౌండ్ లోఒకరు ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
మొంత్తం పదిహేడు మంది...
ఇతర స్థాయిల్లో మరొకరు మొత్తం ఈ 17 మంది సభ్యులు ప్రధానంగా వివిధ కమిటీల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ కగార్' గడువు ముగిసేలోపే తెలంగాణను మావోయిస్టు రహితంగా మారుస్తామని డీజీపీ స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో ఉన్న వారంతా జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రభుత్వం కల్పించే పునరావాస సౌకర్యాలను వినియోగించుకుని లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత కఠినతరం చేశామని, హింసను వీడి వచ్చే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు