ఆదిలాబాద్ జిల్లాలో నేడు బంద్ కొనసాగుతుంది. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ నేడు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. అఖిలపక్ష రైతు సంఘాలతో పాటు ప్రజాసంఘాల నేతలు, వ్యాపారసంస్థలు బంద్ కు మద్దతు తెలిపాయి. ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోయాయి. బంద్ సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు.
సోయా పంటను కొనుగోలు చేయాలని...
సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈరోజు తెల్లవారు జామున మాజీ మంత్రి జోగి రామన్న నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ డిపోముందు బైఠాయించారు. దీంతో పోలీసులు జోగురామన్న ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.