Breaking : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ : కల్వకుంట్ల కవిత

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని కల్వకుంట్ల కవిత ప్రకటించారు

Update: 2026-01-05 07:42 GMT

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందని, త్వరలోనే మరొక కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు కానుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. తాను గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుతానని కల్వకుంట్ల కవిత చెప్పారు. మండలిలో ప్రసంగించిన అనంతరం బయటకు వచ్చి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు.

అందరినీ కలుపుకుని...
యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతుందని కల్వకుంట్ల కవిత చెప్పారు. తెలంగాణలోని బలహీన, బడుగు, మైనారిటీ వర్గాల కోసం ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఉద్యమకారులతో పాటు అమరవీరుల కుటుంబాలు కూడా ముందుకు రావాలని కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు. అందరి కోసం పనిచేసే కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు కవిత ప్రకటించారు.


Tags:    

Similar News