గు డ్ న్యూస్.. హైదరాబాద్ - తిరుపతి మధ్య తగ్గనున్న దూరం

కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెనకు కేంద్ర ప్రభుత్వంటెండర్లు ఆహ్వానించింది

Update: 2026-01-06 04:17 GMT

కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెనకు కేంద్ర ప్రభుత్వంటెండర్లు ఆహ్వానించింది.మొత్తం 816.10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, 1077 మీటర్ల పొడవున ఈ హైబ్రిడ్ వంతెనను ఈపీసీ విధానంలో 36 నెలల్లో పూర్తి చేయనున్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే నంద్యాల, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కర్నూలు మీదుగా వెళ్లే అవసరం లేకుండా 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణంతో...
ఇది ఇరురాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాక పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుందని అధికారులు చెబుతున్నార. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే, హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుంది. సుమారుగా 70 కిలోమీటర్ల మేరకు దూరం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమై, ఆర్థిక మరియు పర్యాటక రంగాలకు కొత్త ఊపందుకుంటుంది.


Tags:    

Similar News