Breaking : మండలిలో కల్వకుంట్ల కవిత భావోద్వేగం..బీఆర్ఎస్ బండారం బయటపెట్టాలనేనా?

శాసనమండలిలో కవిత కన్నీరు పెట్టారు.

Update: 2026-01-05 07:17 GMT

శాసనమండలిలో కవిత కన్నీరు పెట్టారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పై కల్వకుంట్ల కవిత శాసనమండలిలో మాట్లాడారు. మండలిలో కంటతడిపెట్టిన కవిత తాను తెలంగాణ ఉద్యమం కోసం పోరాడానని తెలిపారు. తాను నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ నేడు కోరుకోలేదన్నారు. తనకు ఎంపీ సీటు ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ గెలుస్తారని తనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారన్నారు. నేను టిక్కెట్ కావాలని ఎవరినీ అడ్డుకోలేదన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు ఆయనను తప్పుదోవ పట్టించారన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందన్నారు. తాను ప్రశ్నించినందుకు పార్టీ నుంచి బయటకు పంపారని కవిత కన్నీటి పర్యంత మయ్యారు. ఎనిమిదేళ్ల కోసం ప్రజల కోసమే తాను పోరాడానని తెలిపారు. తాను బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లనని కల్వకుంట్ల కవిత చెప్పారు.

బీఆర్ఎస్ గా మార్చాలన్నా...
ధర్నా చౌక్ ను తొలగించవద్దని తాను ఆరోజు తాను పార్టీలో అంతర్గత సమావేశాల్లో పోరాడినా ఫలితం లేదన్నారు. అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్ల నిర్మాణంలో పెద్ద అవినీతి జరిగిందని, సిద్ధిపేట్, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే రాష్ట్రంలో ఇక మిగిలిన కలెక్టరేట్లు ఎలా ఉంటాయని అన్నారు. కక్షకట్టి తనను పార్టీ నుంచి బహిష్కరించారని అన్నారు. 1969 ఉద్యమకారులను కూడా గుర్తించలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో దారుణాలు జరిగాయని అన్నారు. దళిత బిడ్డలపై అరాచకత్వం జరిగిందని, నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కవిత తప్పుపట్టారు. హరీశ్ రావు అన్నీ రకాలుగా కేసీఆర్ ను తప్పుదోవ పట్టించారన్నారు. తాను ఏ పార్టీకి మద్దతు కానని, తమది ఆస్తుల పంచాయతీ కాదని, ఆత్మగౌరవం పంచాయతీ అని కల్వకుంట్ల కవిత అన్నారు.
తనను జైల్లో పెట్టినా...
బీఆర్ఎస్ పార్టీ తనను ఘోరంగా అవమానించిందని కల్వకుంట్ల కవిత తెలిపిందన్నారు. ఎనిమిదేళ్లుగా తాను చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్నారన్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చడంపై కూడా తాను అంగీకరించలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణలో ఏం పీకామని జాతీయ స్థాయికి వెళ్లి ఏం రాజకీయాలు చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నామని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో తెలంగాణ కాంట్రాక్టర్ చోటు దక్కించుకోవడం తప్ప మనమేం సాధించామని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానళ్లు, న్యూస్ పేపర్లు కూడా తనను దూరం పెట్టాయని అన్నారు. తనపై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టినా పార్టీ నేతలు తనను పట్టించుకోలేదన్నారు. పార్టీ తనకు నాడు అండగా నిలబడలేదని బోరున విలపించారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ను విమర్శిస్తే ఎవరూ మాట్లాడరని, అదే కేటీఆర్ ను అంటే మాత్రం మీడియా సమావేశాలు పెట్టి విమర్శలకు దిగుతారని అన్నారు.


Tags:    

Similar News