Breaking : ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. కోటి రూపాయలు

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

Update: 2026-01-06 07:44 GMT

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కోటి రూపాయల బీమాను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 75 రోజుల్లో సింగరేణిలో క్లాత్ ల్యాబ్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల భద్రతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.

కోటి రూపాయల బీమా...
కష్టపడే వారికి ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి కార్మికులతో పాటు విద్యుత్తు కార్మికులకు కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులందరకీ కోటి రూపాయల బీమా పథకాన్ని వర్తింప చేస్తామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు సంక్షేమం విషయంలో ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News