నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
హత్య కేసులో నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది
హత్య కేసులో నిజామాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి ఉరి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి చెప్పారు. గతంలో బ్రాహ్మణ కాలనీకి సంబంధించిన ఆటో డ్రైవర్ సందీప్ ను దారుణంగా సతీష్ గౌడ్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఆటో విషయంలో తలెత్తిన విభేదాలు ఘర్షణకు దారి తీయడంతో సందీప్ పై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
ఉరి శిక్ష విధిస్తూ...
దీంతో సందీప్ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి న్యాయస్థానానికి పూర్తి స్థాయిలో ఆధారాలు పొందుపర్చారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి దుర్గాప్రసాద్ అతి కిరాతకంగా చంపిన సందీప్ గౌడ్ కు ఉరి శిక్ష విధించాలని తీర్పు చెప్పారు. ఈ హత్య కేసు నిజాబాద్ పట్టణంలో సంచలనం కలిగించింది.