Telangana : తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?
తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పిం
తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సెలవులను ప్రకటించింది. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల ప్రకటన చేయడంతో వారు సొంతూళ్లకు వెళ్లేందుకు అవసరమైన ప్లాన్ చేసుకుంటున్నారు.
వారం రోజుల పాటు...
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో దసరా పెద్ద పండగ. సంక్రాంతికి కూడా ఎక్కువ సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.