Telangana : హిల్ల్ పాలసీపై నేడు తెలంగాణ అసెంబ్లీలో

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటికి ఆరో రోజుకు చేరుకున్నాయి

Update: 2026-01-06 02:32 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటికి ఆరో రోజుకు చేరుకున్నాయి. నేడు హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. నిన్న హిల్ట్ పాలసీపై చర్చ జరగాల్సి ఉండగా దానిని స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేటికి వాయిదా వేశారు. దీంతో ప్రభుత్వం నేడు హిల్ట్ పాలసీపై తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. ప్రతిపక్షం చేసే విమర్శలకు సభ ద్వారా చెప్పనుంది.

తెలంగాణ రైజింగ్ కూడా...
అలాగే ఈరోజు తెలంగాణ రైజింగ్ అంశంపై కూడా స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధితో పాటు రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులు, వివిద సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఏ మేరకు గ్రౌండ్ అవుతున్నాయో సభ ద్వారా ప్రభుత్వం వివరించనుంది. మరొకవైపు బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి తెలంగాణ భవన్ లో సమాంతర సమావేశాలను ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం వెలువరించే అభిప్రాయాలకు కౌంటర్ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తుంది.


Tags:    

Similar News