Telangana :నేడు విద్యావిధానంపై రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విద్యావిధానంపై సమీక్ష చేయనున్నారు.

Update: 2025-09-17 02:25 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విద్యావిధానంపై సమీక్ష చేయనున్నారు. స్పష్టమైన విద్యావిధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. విద్యా విధానంలో తీసుకు రావాల్సిన సంస్కరణలపై కమిటీని కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. వారితో నేడు చర్చించి అవసరమైన నిర్ణయాలను తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.

లోటుపాట్లను సవరించి...
ప్రస్తుతం ఉన్న విద్యావిధానంలో ఉన్న లోటుపాట్లను సవరించి విద్యార్థులకు అవసరమైన, ఉపాధి అవకాశాలతో పాటు వారికి మరింత విజ్ఞానాన్నిఅందించేందుకు విధానాన్ని రూపకల్పన చేయాలని ఆదేశించారు. దీంతో పాటు ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి విషయాలపై కూడా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించారు.


Tags:    

Similar News