Revanth Reddy : జమిలి ఎన్నికలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
జమిలి ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
revanth reddy
జమిలి ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల పేరుతో కొందరు దేశాన్ని కబళించాలని చూస్తున్నారని అన్నారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏచూరి చూపిన మార్గంలో వెళ్లి జమిలి ఎన్నికలను అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అందరూ వ్యతిరేకించాల్సిందే...
జమిలి ఎన్నికలతో తమ అధికారాన్ని కాపాడుకోవడానికి మరోసారి ప్రయత్నం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తూ ఏకపక్ష నిర్ణయాలకు దిగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.