Telangana : నేడు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్?

నేడు తెలంగాణలో మున్సిపల్‌ పోరుకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది.

Update: 2026-01-27 04:22 GMT

నేడు తెలంగాణలో మున్సిపల్‌ పోరుకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది. ఈరోజు ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సీఎస్‌తో ఈసీ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని అధికారులతో చర్చించి మున్సిపల్ ఎన్నికలపై సన్నద్ధతతను గురించి అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది.

సాయంత్రానికి విడుదలయ్యే...
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మున్సిపల్ ఎన్నిలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. నేడు షెడ్యూల్ ను విడుదల చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందుకోసం అవసరమైన ఫీడ్ బ్యాక్ ను అధికారుల నుంచి తీసుకోనున్నారు.


Tags:    

Similar News