Weather Report : వాతావరణం మారింది.. అప్ డేట్ తెలుసా?

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గింది

Update: 2026-01-27 04:09 GMT

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారింది. చలి తీవ్రత తగ్గింది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొంత ఉదయం వేళ చలితో పాటు దట్టమైన మంచు కురుస్తున్నప్పటికీ ఉదయం పది గంటల నుంచి ఎండల తీవ్రత మొదలయింది. అయితే తాజాగా వాతావరణ శాఖ చెప్పిన నివేదిక మేరకు అల్పపీడన ప్రభావంతో వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది. అల్పపీడన ద్రోణి ఉత్తర కేరళతో పాటు, అరేబియా సముద్రంవైపునకు ముందుకు కదులుతుందని, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో మోస్తరు వర్షాలుపడతాయని వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

క్రమంగా ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పొగమంచు మాత్రం మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని చెప్పింది. ఈరోజు ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, పొగమంచు కూడా కొన్నిచోట్ల ఉండే అవకాశముందని తెలిపింది. దక్షిణ కోస్తాలో కూడా పొడి వాతావరణం ఉంటుందని, చలి గాలుల తీవ్రత తగ్గి ఉక్కపోత మొదలవుతుందని పేర్కొంది. రాయలసీమలో మాత్రం ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పొడి వాతావరణం...
తెలంగాణలోనూ చలి తీవ్రత పూర్తిగా తగ్గింది. రాష్ట్రమంతటా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత మేరకు చలిగాలులు వీస్తాయని, మంచు కూడా కురిసే అవకాశముందని తెలిపింది. అయితే వానలు పడే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ శాఖ మాత్రం వెల్లడించలేదు. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. ఇక ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం వేళ, తెల్లవారు జాము మినహా మిగిలిన సమయాల్లో వేడి గాలులు కూడా వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Tags:    

Similar News