కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Update: 2026-01-27 06:26 GMT

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమ బంధువులు ఇంటికి బయలుదేరి ఒక కుటుంబం మరో ఐదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకునేలోపు ఈ పరిణామం చోటు చేసుకుంది.

బంధువుల ఇంటికి వెళుతూ...
పోలీసుల కథనం ప్రకారం. మంచిర్యాల జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ కు చెందిన కుటుంబం సాయంత్రం బయలుదేరి కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లోని బంధువుల ఇంటికి బయలుదేరారు. రాత్రి కావడంతో ముందు వెళుతున్న లారీని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడగా, మహిళ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News