Telangana : ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన జరగనుంది.
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 5వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో ప్రధానంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అందిన సాయంతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశముంది.
ఈ అంశాలపై...
దీంతో పాటు రాజీవ్ యువవికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. పలు అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది.