Breaking : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు

Update: 2026-01-29 08:08 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకుని కేసీఆర్ పీఏకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని, అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు.

రేపు మూడు గంటలకు...
ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ లతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులను కూడా సిట్ అధికారులు ఇప్పటికే విచారణ చేసిన సంగతి తెలిసిందే.ఆయన ఆరోగ్యం, వయసు దృష్ట్యా అక్కడికే వెళ్లి విచారించే అవకాశముంది. ఆయన కోరుకున్న చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉండాలని తెలిపిన సిట్ అధికారులు, స్టేషన్ లో విచారణకు మినహాయింపు ఇచ్చారు.


Tags:    

Similar News