Telangana : నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు
Assembly Meetings Speaker Election
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ నుంచి గడ్డం ప్రసాదరావు ఒక్కరే స్పీకర్ పదవికి నామినేషన్ వేయడంతో ఆయన స్పీకర్ గా ఎన్నిక ఖాయమయింది. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ప్రొటెం స్పీకర్ స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటిస్తారు.
స్పీకర్ ఎన్నిక తర్వాత...
అనంతరం స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు బాధ్యతలను చేపడతారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే దానిపై సభలో తర్వాత చర్చ జరగనుంది. కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. శాసనసభ సమావేశాల సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు. కేవలం పాస్ ఉన్న వారినే లోపలికి అనుమతిస్తారు.