నేడు విచారణకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు ముమ్మరం చేశారు

Update: 2025-06-27 02:52 GMT

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మందిని విచారించిన సిట్ అధికారులు వారి స్టేట్ మెంట్లను రికార్డు చేశారు. కేవలం అధికారులు మాత్రమే కాకుండా రాజకీయ నేతలు కూడా విచారణకు హాజరై తమకు వచ్చిన అనుమానాలు సిట్ అధికారులకు వివరించారు.

నేటి విచారణలో...
నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ప్రధాన దినపత్రిక ఎండీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. తర్వాత ఈరోజు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సైతం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కూడా విచారణకు నేడు హాజరు కావాల్సి ఉంది.


Tags:    

Similar News