Telangana : సరస్వతి పుష్కరాలకు రోజుకు లక్షన్నరమంది భక్తులు

సరస్వతి పుష్కరాలు రెండోరోజుకు చేరుకున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు

Update: 2025-05-16 01:55 GMT

సరస్వతి పుష్కరాలు రెండోరోజుకు చేరుకున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమయిన సరస్వతి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నరకుపైగానే భక్తులు సరస్వతి పుష్కరాలకు వస్తారని ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా త్రివేణి సంగమం ప్రాంతంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. దీంతో పాటు గజ ఈతగాళ్లను కూడా అక్కడ నియమించింది.

నేడు రెండో రోజు...
కేవలం పుణ్య స్నానాలు చేసేందుకు మాత్రమే అనుమతిస్తూ వెనువెంటనే వెళ్లేలా అక్కడి సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కుంభమేళా స్పూర్తితో కాళేశ్వరంలోనూ టెంట్ సిటీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 26వ తేదీ వరకూ సరస్వతి పుష్కరాలు జరుగుతుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసింది.


Tags:    

Similar News