అదిగదిగో పెద్దపులి.. భయం భయంగా

కామారెడ్డి జిల్లాలో పులి సంచారం భయపెడుతుంది.

Update: 2025-12-17 04:00 GMT

కామారెడ్డి జిల్లాలో పులి సంచారం భయపెడుతుంది. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలానికి పెద్దపులి వచ్చినట్లు సమాచారం వచ్చింది. మూడు లేగ దూడలపై పెద్ద పులి దాడి చేసింది. పులి సంచారం విషయాన్ని ఇప్పటికే అటవీ శాఖ అధికారుల దృష్టికి స్థానిక ప్రజలు తీసుకెళ్లారు. దీంతో వారు వచ్చారు.

ఒంటరిగా పొలాలకు...
ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పశువుల కాపర్లు, పొలాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలాలకు వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ముగ్గురు అధికారులు వచ్చి పులి జాడలను పరిశీలించారు.


Tags:    

Similar News