కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం
కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.
కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ఒక దూడపై దాడి చేయడంతో గ్రామస్థులు భయపడిపోతున్నారు. పెద్దపులి అక్కడ తిరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పొలాలకు ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
బయటకు రాకుండా...
పెద్దపులి పాదముద్రలను కూడా గుర్తించారు. పులి అక్కడే తిరిగే అవకాశముందని ఎవరూ రాత్రి వేళ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే పెంపుడు జంతువులను కూడా బయట ఉంచవద్దంటూ అటవీ శాఖ అధికారులు తెలిపారు. పెద్దపులి జాడ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.