Telangana : ఎమ్మెల్యేల అనర్హతపై నేడు స్పీకర్ నిర్ణయం

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు నిర్ణయం తీసుకోనున్నారు

Update: 2025-12-17 04:44 GMT

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా మారారని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందిని విచారించారు. అయితే ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారించారు.

ఐదుగురు ఎమ్మెల్యేలను...
దానం నాగేందర్, కడియం శ్రీహరిలను మాత్రమే విచారించాల్సి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు స్పీకర్ కార్యాలయం తీర్పు వెలువరించనుంది. ఎమ్మెల్యేల న్యాయవాదులకు ఇప్పటికే స్పీకర్ కార్యాలయం సమాచారం అందించింది. ఐదు పిటీషన్లపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఎమ్మెల్యేల అడ్వొకేట్లు స్పీకర్ కార్యాలయానికి హాజరు కానున్నారు.


Tags:    

Similar News